మణి పూసలు--చందమామ ఆటలు(బాల గేయం):-ఎడ్ల లక్ష్మి . సిద్దిపేట
ఆటలోన చందమామ
పాటలోన చందమామ
అందకుండా ఉంటుంది
నింగి మీద చందమామ

పాపతోటి అడుతాడు
బాబుతోటి పాడుతాడు
ఆడి పాడి చందమామ
చిట్టి బొజ్జ నింపుతాడు

వెలుగు లన్ని పంచుతాడు
మబ్బులోన దూరుతాడు
అటూ ఇటూ చూస్తూ
నీడనేమొ చూపుతాడు

ఆట లన్ని ఆగిపోయె
పాటలేమొ మూగ బోయె
పిల్లలాట ఆపినారు
అవ్వ చూసి బీరి పోయె

తారలన్ని వచ్చినాయి
దాగి చూసి నవ్వినాయి
ఆడమని చెప్పుకుంటూ
తెప్నలెల్లి పోయినాయి