అచ్చులతో కైతికాలు( బాల గేయం );--ఎడ్ల లక్ష్మి-సిద్దిపేట
అమ్మ భాష కమ్మగా
ఆటలాడుచుండగా
ఇంటిలోని పాపాయి
ఈ భాష నేర్వగా
వారెవ్వా అమ్మ భాష
ఎంత మంచి గున్నది

ఉమా రమా వచ్చి
ఊయలెక్కి ఊగగా
రుక్కు వచ్చి చూసి
రూపాయి అడుగగా
వారెవ్వా  రూపాయి
ఎవరైనా ఇస్తారా

లుంగి బాబు వచ్చాడు
లూటి మాపి చేసాడు
ఎగురు కుంటు వాడు
ఏనుగు మీద ఎక్కాడు 
వారెవ్వా పొట్టోడు
ఐదు పైసలిచ్చాడు

ఒంటి కన్ను పిల్లోడు
ఓంకారం పలికాడు
ఔషధాలు తెచ్ఛాడు
అందరికి ఇచ్చాడు
వారెవ్వా ఔషధం మింగారు
ఆః అంటు హాయిగున్నారు

కామెంట్‌లు