పానీ పూరీ -(బాల గేయం)-- ఎం. వి. ఉమాదేవి - నెల్లూరు
పానీ పూరీ తిందామా 
పందెం వేసుకుందామా? 
పది పది చొప్పున లాగించి 
పాఠం వ్రాసుకుందామా? 

రోడ్డు ప్రక్కవి తినవద్దు 
ఇంట్లో చేసినవే ముద్దు 
పుదీనా పులుసు,బఠాణి కూర 
అమ్మకి ఉంచు మరవొద్దు!

మైదా గోధుమ పిండికలుపు 
తడి బట్టతో కప్పి ఉంచు 
బుల్లి బుల్లివే పూరీలొత్తు 
అమ్మ కిస్తే ఆమె వేయించు!

క్రికెట్ బాల్ లా పొంగాలి 
వేలితో గుచ్చి పులుసేయాలి 
ఉల్లి చక్రాలు బఠాణి కూర 
నంజుకుంటూ ఆం తినాలి !