నా పుస్తకం తీసుకోని నన్నే కొట్టాడు:-డా:కందేపి రాణి ప్రసాద్

 నేను ఆరవతరగతి చదివే రోజులు అంటే కొత్తగా హై స్కూలుకు వెళ్ళటం మొదలైన రోజులన్నమాట. నేను అప్పటిదాకా స్కూలుకే వెల్లనందున బడి వాతావరణం అందంగా కనిపించేది.స్కూలుకే వెళ్లలేదంటే చదువుకోలేదు అనుకునేరు.ఇంటి దగ్గరే ఐదు తరగతులు చదువుకున్నాను.మానాన్న గారు మాస్టార్ర్నే  ఇంటికి పిలిపించి పాఠాలు చెప్పించారు.
అందువల్ల మొదటి సారిగా హై స్కూలును చూస్తునందున ఆశ్ఛర్యనందమిలితాలు నా మొహంలో ప్రకాశించేవి.
స్కూలు ముంగిట పాపిడి బండి ఐస్ క్రిముల బండి
ఇంకా రంగు పాపిడి పుల్లకు చుట్టే బండి ఉండేవి.ఇంకా చిన్న బుట్టలో పెట్టుకొనె తాటిచాప.నూగుజీడీలు ముసలమ్మలు కూర్చుని అమ్ముతుండేవాళ్ళు.మాములు ఐస్ 5 పైసలు పాల ఐస్ 10 పైసలు ఉండేది.ఇంకా దారిలో వేరుశనగ ముద్దలు అమ్మేవాళ్ళు అవి కూడా చిన్నవైతే 5 పైసలు 
పెద్దవైతే 10 పైసలు ఉండేవి.స్కూల్ ముందు పిల్లలంతా ఏదోఒకటి కొనుక్కుతింటూ ఉండేవాళ్ళు.
నాకు అప్పటిదాకా ఇలాంటివి ఉంటాయని తెలుయదు కాబట్టి డబ్బులు తెచ్చుకోవటం తెలువదు.ఆ తర్వాత నేను డబ్బులు తెచ్చుకొని ఐస్ లు పాపిడీలు కొనుక్కుని తినేదాన్ని.
తాటిచాప ను మాత్రం ఇంటికి తిరిగి వెళ్లే సమయములో కొనుక్కునే వాళ్ళం.ఎందుకంటే దాన్ని చప్పరిస్తూ ఊరిస్తూ  తినుకుంటు ఇంటికి వెళ్ళేదాక తింటూ ఉండేవాళ్ళం.ఇల్లు చాలా దూరం కాబట్టి దాన్ని చప్పరిస్తూ నడుస్తుంటే దూరం తెలిసేది కాదు.
ఒకరోజు స్కూల్లో ఫస్ట్ పీరియడ్ అయిపోయాక సెకండ్ పీరియడ్ మాస్టారి కోసం ఎదురు చూస్తున్నాం.కాసేపటికి సుందర్రావు మాస్టారని వచ్చారు.మేమందరం పుస్తకాలు తెరిచి పెట్టుకున్నాం
రెడీగా మాస్టారు రాగానే ఏది ని టెస్ట్ బుక్  ఇలా ఇవ్వు అంటూ నా దగ్గర పుస్తకం తీసుకున్నాడు.పిల్లలకెవరికైనా వాళ్ళ పుస్తకాలు మాస్టారు తీసుకుంటే ఎంతో గొప్పగా పిలవుతారు.నేను కూడా ఆకాశంలో తేలుతూ వెళ్లి మాస్టారికి  పుస్తకం అందించాను.అదీ నేను ఇప్పటిదాకా స్కూలుకె పోకపోవటం మూలన ఇవన్నీ అద్భుత అవకాశాలుగా అనిపించసాగాయి నాకు.కొత్తగా స్కూల్లో చేరిన నాకు సడన్ గా స్కూల్ లీడర్ పదవి ఇచ్చినట్లుగా పిలయ మొహం చాటంత చేసుకొని వచ్చి నా సీట్లో కూర్చున్నాను.క్లాసులో ఉన్న పిల్లలందరిలోకి నేను ఏదో గొప్ప అయినట్లు నేను ఏదో సాధించినట్లు కలల్లో తెలిపోసాగను.
ఇలా ఆనందలోకల్లో విహరిస్తున్న నాకు అకస్మాత్తుగా ఏయ్ రాణి స్టాండప్  అన్న మాటలు వినిపించి ఈ లోకంలోకి వచ్చాను.ఏంటో అర్థం కాని మొహం తో లేచి నిలబడ్డాను.నీ టెక్స్ట్ బుక్ ఏది పాఠం చెప్పేటప్పుడు టెక్స్ట్ బుక్ చూడాలని చెప్పాను గదా అన్నాడు మాస్టారు గట్టిగా.
అప్పటికి నేను పక్కనున్న మా స్నేహితురాలి పుస్తకంలో చూస్తూనే వింటున్నాను. అదే చెప్పాను పక్కనమ్మాయి పుస్తకంలో చూస్తున్నాను సార్ అన్నాను.
పక్క అమ్మాయి దాంట్లో ఎందుకు చూస్తున్నావు?
అదే కదా నేనడిగేది? నువ్వు బుక్ ఎందుకు తెచ్చుకోలేదు.రోజు టెక్స్ట్ బుక్ ల న్నీ తెచ్చుకోవాలని తెలీదా స్కూల్లో చేరిన మొదటి రోజే చెప్పాం గదా! పుస్తకాలు తెచ్చుకోకుండా ఏం చేద్దామని వచ్చావు?కోపంగా అడుగుతున్నాడు మాస్టారు.
 
నాకసలు ఏమీ అర్థం కాలేదు.నేను టెక్స్ట్ బుక్ తెచ్చుకోలేదు అంటాడేంటి.నా పుస్తకం ఆయనే కదా తీసుకున్నాడు.నాకు చాలా కోపం వచ్చింది.నా పుస్తకం తీసుకున్నది కాక నన్నే తిడతాడా అని.అసలు అప్పటిదక స్కూలు మాస్టార్ ని ఇంటికి పిలిపించి చదువుకున్నానేమో.ఆ మాస్టర్లు ఎవరు నన్ను కోపడలేదు.అసలు  వాళ్ళు కోప్పడానికి నేను అల్లరి పనులు చేయలేదు.ఇప్పుడు హై స్కూలు కు వచ్చాక క్లాసులో అందరి ముందు మాస్టారు అలా అనడం చాలా అవమానంగా అనిపించింది. పైగా నా తప్పేమీ లేకుండా నన్నెందుకు తిడుతున్నాడో నాకర్థం కాలేదు.నాకేమో ఉక్రోషం తన్నుకొస్తోంది.కానీ ఏమనాలో తెలియక అలా చూస్తుండీ పోయాను.ఈసారి  ఎప్పుడు టెక్స్ట్ బుక్ లు లేకుండా రాకు .మళ్ళీ ఇలా కనిపించావంటే తొడపాశం పెడతా అని బెదిరించాడు మాస్టర్.
నాకంతా అయోమయంగా ఉన్నది ఇప్పటి దాకా ఎవరూ పన్నెత్తి మాట నన్ననక పోవటంతో కోపం గాను ఉన్నది.నా పుస్తకం తీసుకొని నన్నే తిడతాడా  అనే కోపమే గానీ ఒకవేళ ఎవరి పుస్తకం తీసుకున్నాడో మరిచిపోయాడేమో అన్న ఆలోచన నా చిన్ని బుర్రకు తట్టలేదు.అంత వయసున్న మాస్టారే ఎవరి దగ్గర పుస్తకం తీసుకున్నామో   మర్చి పోయి ,మరల పక్క అమ్మాయి పుస్తకంలో చుస్టన్నవని  అంటూ నన్ను అడిగితే నేనేం చేయాలి .ఏం చేయాలో అర్థం కాక అలాగే నిలబడ్డాను.
మాస్టార్ తిట్టటం అయ్యేసరికి బెల్ కొట్టారు.సరే రేపు  చెప్పుకుందాం అంటూ పుస్తకం మూసేసి ఇదుగో ఈ బుక్ ఎవరిదో తీసుకోండి అన్నాడు.నేను పుస్తకం తెచ్చుకోవడానికి ముందుకు వెళ్ళాను.ఏంటి ఇది నీదా?ఆశ్చర్యంతో కొద్దిగా పశ్చాత్తాపంతో అడిగాడు మాస్టారు నన్ను నేను ఇంకా కోపంగానే ఉన్నాను.పుస్తకం తీసుకొని అట్టమీద ఉన్న నా పేరు చూపించాను.మాస్టారికి ఇదుగో నా పేరు ఇది నాది అన్నాను ఉక్రోషంగా .ఆయనకు తను చేసిన తప్పు అర్ధమైంది.కానీ సారి చెప్పేంత సంస్కారం లేదు గదా
సరే తీసుకో అంటూ పుస్తకం నా చేతి కిచ్చి వెళ్ళిపోయాడు.నేను ఆరోజంతా కోపంగానే ఉన్నాను.నా పుస్తకం తీసుకొని నన్నే తిట్టాడు అని.ఇప్పుడు గుర్తుకొస్తే నవ్వా స్తుంది.గానీ టీచర్లు పిల్లల మనసును గ్రహించాలి.