జోగినిలుగా ఇద్దరు మైనర్ బాలికలను మార్చాలనుకున్న ప్రయత్నం భగ్నం:-బాలల సంక్షేమ సమితి (CWC) ఛైర్ పర్సన్ నల్లాని రాజేశ్వరి అభినందనలు
 అనంతపురం జిల్లా హీరేహాళ్ , బొమ్మనహాళ్ మండలాల్లో ఇద్దరు మైనర్ బాలికలను జోగినిలుగా దించాలనుకున్న ప్రయత్నాన్ని పోలీసులు, ఇతర ప్రభుత్వ అధికారులు సమిష్టిగా భగ్నం చేశారు. ఇద్దరు బాలికలకు విముక్తి కల్పించి వారి భవిష్యత్తు కోసం ఒకరిని బాల సదన్ ... మరొకరిని ఓ ప్రభుత్వ పాఠశాలలో చదివేందుకు చేర్పించారు. 
          హీరేహాళ్ మండలంలోని ఓ గ్రామానికి చెందిన 7 సంవత్సరాల చిన్నారిని.... బొమ్మనహాళ్ మండలంలోని ఓ గ్రామానికి చెందిన 14 సంవత్సరాల బాలిక ను వేర్వేరుగా జోగిని వ్యవస్థలో నెట్టే ప్రయత్నం చేస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. రాయదుర్గం రూరల్ సి.ఐ రాజ, సంబంధిత ఎస్సైలు, పోలీసు సిబ్బంది మరియు ఇతర ప్రభుత్వ అధికారులు, సిబ్బంది సంయుక్తంగా ఆయా గ్రామాలకు వెళ్లి జోగినిలుగా మార్చకుండా అడ్డుకున్నారు. అంతేకాకుండా... వారి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ చేసి ఆ అమ్మాయిలకు విముక్తి కల్పించారు. వీరిలో ఒకరిని అనంతపురం బాల సదన్ కు... మరొకరిని ఆ ప్రాంతంలోని ప్రభుత్వ పాఠశాలలో చదువు నిమిత్తం చేర్పించేలా సంబంధిత అధికారులతో మాట్లాడారు. కోవిడ్ పరీక్షలు అనంతరం బుధవారం ఈ ఇద్దరు చిన్నారులను చేర్పించనున్నారు.
బొమ్మనహళ్ తాసిల్దార్ కార్యాలయంలో  తల్లి శ్రీదేవికి,   కూతురు వనిత కు నచ్చచెప్పి స్థానిక కేజీబీవీ పాఠశాలలో విద్యాభ్యాసం కోసం ప్రత్యేక అధికారి మహాలక్ష్మికి బాధ్యతలు అప్పచెప్పారు.  సీఐ రాజా, తాసిల్దార్ అనిల్ కుమార్, ఎస్సై రమణారెడ్డి, ఐసిడిఎస్ సూపర్వైజర్ రమాదేవి , ఎంఈవో తిమ్మప్ప తదితరులు పాల్గొన్నారు.