ఉపాయం(కథ) యడ్ల శ్రీనివాసరావుMTel,MSw-విజయనగరం జిల్లా-చరవాణి: 9493707592

 దుర్గపురం అనే ఊర్లో శ్యామ్ నివసిస్తూ ఉంటూ ఉండేవాడు. అతని మంచి కవి అయితే అతను అనేక పుస్తకాలు రచించినాడు మరియు గదిలో బీరువాలో  ఎక్కువ పుస్తకాలు ఉండేవి అయితే  రోజు తన పుస్తకాలు చదవడం తన అలవాటు.
                 ఆ ఇంట్లో ఎలుకలు సమస్య ఎక్కువగా ఉండేది దాంతో అతనికి ఏం చేయాలో తోచక తలమునకలై ఏడవ సాగాడు.
                 
               అనుకోకుండా అతను ఒక పిల్ల్ని పెంచితే బాగుండును అనిపించింది ఒక రోజు తను మ్యారేజ్ ఫంక్షన్ కి వెళ్లగా అక్కడ తన స్నేహితుడు తనకు ఒక పిల్లిని బహుమతిగా ఇచ్చాడు ఆ పిల్లిని తీసుకొని వచ్చి తన ఇంట్లో పెంపకం చేశాడు.
              ఇక పుస్తకాలు తినడానికి ఎలకలు బయటకు వస్తూనే ఉన్నాయి. వెంటనే పిల్లి దూకి ఆ ఎలుకలు అన్ని కూడా తినడం సాగింది.
               దీనితో తన ఇంట్లో ఎలుకలు బెడద మాయ అవ్వడం జరిగింది. సుదీ తెచ్చిన సౌందర్యము అన్నట్లు ఆనాటి నుంచి హ్యాపీగా జీవనం సాగించాడు.