తిప్పతీగ కాడల కషాయంతో మనం కంటి సమస్యలు రాకుండా కాపాడుకోవచ్చు. కొన్ని తిప్పతీగ కాడల్ని నలగ్గొట్టి నీటిలో వేసి అందులో కొద్దిగా త్రిఫల చూర్ణం వేసి రావి చెట్టు ఆకుల రసం కలపాలి. దీన్ని బాగా మరిగించి చల్లార్చి తాగితే కంటి దృష్టి పెరుగుతోంది. తిప్పతీగ కాడల రసంలో కొద్దిగా తేనె కలిపి తాగితే వాంతులు అరికట్టబడతాయి. ఇదే కషాయం త్రాగితే పచ్చకామెర్లు రాకుండా ఇది కాపాడుతుంది.అన్ని రకాల మొలల వ్యాధులు తగ్గడానికి, తిప్పతీగ కాడల రసంలో కరక్కాయ పొడిని కొత్తిమీర ఆకులను వేసి బెల్లం కూడా కలిపి మరిగించి చల్లార్చి తాగాలి. మొలల సమస్య తగ్గిపోతుంది.
మోకాళ్ళ నొప్పులు కీళ్ల నొప్పులు ఎక్కువ అయినప్పుడు, తిప్పతీగ కాడల రసం లో అశ్వగంధ చూర్ణం కలిపి తాటి కలకండ వేడి పాలలో కలిపి త్రాగాలి. కొద్ది రోజులలో కీళ్ల నొప్పులు తగ్గుముఖం పడతాయి.
అధిక బరువును తగ్గించుకోవడానికి, మధుమేహ వ్యాధిని అదుపులో ఉంచుకోవడానికి కూడా తిప్పతీగ కషాయాన్ని వరుసగా త్రాగాలి.
తిప్పతీగ ఆకులను ఆముదం లో వేసి తైలంగా కాచి వాపుల పై నొప్పుల పై రాసుకుంటే తగ్గిపోతాయి.
చర్మవ్యాధులు తగ్గడానికి కూడా తిప్పతీగ కాడల రసం నువ్వుల నూనెతో కలిపి తైలంగా కాచి దురద ల పై రాస్తే దురదలు తగ్గిపోతాయి. తిప్పసత్తు పొడిని తేనెలో కలిపి చిన్నపిల్లలకు వాడితే జలుబు దగ్గు జ్వరాలు తగ్గిపోతాయి
ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ప్రస్తుతం టాబ్లెట్ల రూపంలో ఆయుర్వేద షాపుల్లో ఇవి లభ్యమవుతాయి.
తిప్పతీగ కాడలను నాటి కుండీలలో కూడా పెంచుకోవచ్చు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి