లక్ష్యాన్ని చేరు:-పొట్టోల్ల లహరి 10వ తరగతి zphs గుర్రాలగొంది జిల్లా సిద్దిపేట -చరవాణి 9704865816
విమాన మెంతో ఎత్తును
దూసుకెళ్లుచూ నుండెను
బాలుడాలోచనజేసి 
ఎగిరందు కోవాలనెను

లక్ష్య మెంత గొప్పగాను 
పిల్లవాడు పెట్టుకొనెను
దానినందుకోవాలని
విశ్వప్రయత్నము జేసెను

సోమరి లక్ష్యాలను
పెట్టుకొనక యుండును
సోకులాకునెప్పుడు 
మాత్రము పనికొచ్చును

లక్ష్యమేమి లేనివారు
జీవితాన ఎదుగ లేరు 
అట్టి మనుషులందరిని
 మెచ్చుకొన్నవారు లేరు 

లక్ష్య మెపుడు గొప్పగాను 
పెట్టుకోవాలందరును 
జీవితంతో పోరాడు
ఓటమంటె నెరుగ లేడు
 
చదువుకునే బాలలు
పట్టుదలగచదువులు
చదువు చుండినంతను
తెరుచు విజయదారులు