దాహం- మణిపూసలు: -పొట్టోళ్ల లహరి-10వ తరగతి-ZPHS గుర్రాలగొంది -జిల్లా సిద్దిపేట -చరవాణి:9704865816
అడవులే నశించాయి
చెరువు లెండిపోయాయి
పక్షులు జంతువులకేమొ
నీళ్లే కరువయ్యాయి

నాలుగు పిచ్చుకలుండెను
వాటికి దాహము వేసెను
అందులో తల్లి పిచ్చుక
నీళ్ళ కోసమని వెదికెను

ఊరంతా తిరిగెను
వెతికి వెతికి చూసెను
వాటికి ఒక దగ్గర
నల్లా కనిపించెను

తల్లి పిచ్చుక చూసింది
నల్ల పైనను కూర్చుంది
తన ఎడమ కాలితో
నల్లనేమో తిప్పింది

పిల్లలు నీరు త్రాగెను
వాటి దాహము తీరెను
అప్పుడు అవి గూటికి
సంతోషంగ వెళ్ళెను.