కొబ్బరి బొండము:-పొట్టోల్ల లహరి-10వ,తరగతి Zphs:గుర్రాలగొంది జిల్లా సిద్దిపేట-చరవాణి:9704865816

కొబ్బరికాయ చెట్టుకును
చాలబొండములు కాసెను
వాటి నమ్మె  వాడు చూసి 
బోండములు కోయ చూసెను

కత్తి తీసుక వచ్చెను 
కొబ్బరి బోండలుకోసెను
బండి మీద బజారుకు 
తీసుకువెళ్లి అమ్మెను

కొబ్బరి బొండ కొనెవారు
బండి దగ్గరికొచ్చారు
బొండ రేటు ముప్పై యనగ
బొండము తీసుకున్నారు

వాటిల నీళ్లు తాగారు 
దాహము తీర్చుకున్నారు
ఎండదెబ్బకు బోండాలు 
ఉపయోగపడునన్నారు

పచ్చికొబ్బరి తీసెను 
వారికంతను ఇచ్చెను
కొబ్బరంతతిని వారు
ఇంటి కెళ్ళిపోయేను

కామెంట్‌లు