*ఉగాది సందడి* :-రామగుండం అజయ్, 10 వ తరగతిజిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల చెగ్యాం,మండలం. వెల్గటూర్, జిల్లా. జగిత్యాల.

 ఇంటింటికి మామిడితోరణాలు 
గడపగడపకు పసుపు కుంకుమలు 
మట్టితో చేసిన మాణిక్యాలు
లేలేత మామిడికాయలు
విరబూసిన వేప పూతతో
షడ్రుచుల సమ్మేళనంతో
కొత్త కుండలోని పచ్చడి
కలిగించును ఆరోగ్యాన్ని
చిన్నారుల చిలిపి చేష్టలు 
బంధువుల కోలాహలం
పంచాంగ శ్రవణంతో
వచ్చె వచ్చె ఉగాది పండుగ
ఇంటింటింటా సందడి తెచ్చె

కామెంట్‌లు