తాతయ్య కబుర్లు-10. - ఎన్నవెళ్లి రాజమౌళి


 పిల్లలూ! ఆబాలగోపాలాన్ని అలరించేవి కథలు. తాతయ్య చెప్పిన కథలు, అమ్మమ్మ చెప్పిన కథలు, నానమ్మ చెప్పిన కథలు మేము వినే వాళ్ళం. ఇప్పటి పిల్లలకు కథలు చెప్పే వాళ్ళు లేరు. మొలక, మొగ్గ, హాయ్ బుజ్జి లాంటి బాలసాహిత్యంలో మీకు కథలు లభ్యమౌతాయి. విడువకుండా చదవాలి. కథలు చదవడం వలన జ్ఞానం పెరుగుతుంది.పఠనం పై అభిరుచి పెరుగుతుంది. ముఖ్యంగా మొలక పిల్లల కొరకు వాట్సాప్ లో కొనసాగిస్తున్నారు. మహాత్మా గాంధీ తన బాల్యంలో హరిచంద్ర నాటకం, శ్రావణ కుమారుడు నాటకం చూశాడట. ఇప్పుడా నాటకాలు లేవు. కథలు చదివి తెలుసుకోవాల్సిందే! గాంధీజీ గారిని నాటకాలే ప్రభావితం చేశాయి. ఈ విషయము తన జీవిత చరిత్రలో రాసుకున్నారు. ఇంకెందుకు ఆలస్యం... మీరు కూడా కథలు చదువుతారు కదూ!