ఆనందంగా చదువుదాం:-రామగుండం అజయ్, 10 వ తరగతి,-జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల చెగ్యాం,-వెల్గటూర్ మండలం, జగిత్యాల జిల్లా.

 రండి రండి పిల్లలు కదిలిరండి పిల్లలు
చకచకమంటూ బడికి రండి పిల్లలు
ఆటపాటలతో ఆనందంగా చదువుదాం
చక్కని క్రమశిక్షణతో మెలుగుదాం
గురువులు చెప్పే మాటలు విందాం
మంచి విలువను పెంచుదాం
మానవత్వమును చాటుదాం
చదువే మన భవితని తెలుపుదాం
ఉన్నత చదువులు చదువుదాం
ఉత్తమ పౌరులుగా ఎదుగుదాం
పరులకు సాయము చేద్దాం
పదిమందిలో గౌరవంగా బతుకుదాం
అమ్మానాన్నలకు మంచి పేరు తెద్దాం..

కామెంట్‌లు