తాతయ్య కబుర్లు-11.:- ఎన్నవెళ్లి రాజమౌళి


 పిల్లలూ! పద్యం రస నైవేద్యం అన్నారు. మేము చిన్నగా ఉన్నప్పుడు ఎవరైనా ఇంటికి వస్తే... పద్యం చదువు మని అనేవారు. పద్యాలను కంఠతా బట్టీ పట్టాలి. చిన్నప్పుడు భావం తెలవకున్నా... పెద్ద అయిన తర్వాత తెలుస్తుంది. పశువులు గ్రాసం వేసినప్పుడు మేసి తర్వాత నెమరు వేసుకొని రుచిని పొందినట్టు.... పెద్దయిన తర్వాత అర్థం తెలుసుకుని అనుభూతి పొందుతారు. తరగతిలో తెలుగు లోని పద్యభాగం లో పద్యాలన్నీ నేర్వాలి. సందర్భోచితంగా పద్యం చదివి అర్థం చెబితే అక్కడ మనం గొప్పగా భావించబడతాము. పండితులైన వారికి కనీసం వంద పద్యాలు రావాలని పెద్దలు అంటారు. మీరు ఈమాట మరవకుండా పద్యాలు నేర్చుకుంటారు కదూ!