తాతయ్య కబుర్లు-16.:- ఎన్నవెళ్లి రాజమౌళి


 సంపాదనలో తనకంటే తక్కువ వారిని చూసి తృప్తి పడాలి, విద్యలో తనకంటే ఎక్కువ విద్యావంతుల తో పోటీ పడాలి అని అంటారు. కానీ, ఇది అందరి విషయంలో సరి కాకపోవచ్చు. మెదడు కూడా అందరిదీ ఒకేలా ఉండదు. అందరూ కలెక్టర్లు, డాక్టర్లు కాలేరు. చదువులో పోటీపడ లేనప్పుడు కోర్సులో మార్పు చేసుకోవాలి. అదికూడా సాధ్యం కానప్పుడు టెక్నికల్ గా వెళ్లాలి. అంతేగాని, చదవలేక పోయానని కొందరు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అది పేపర్లలో కూడా చూస్తున్నాం. తల్లితండ్రులు కూడా సాధ్యంకాని చదువును పిల్లలపై రుద్దాలని చూడకూడదు. పేరెంట్స్ లో ఒత్తిడి వచ్చినా, నాతోని కాదని చెప్పాలి కానీ, ఆత్మహత్యల జోలికి పోకూడదు. జీవితం పూర్తిగా అనుభవించాలి.ఇది అర్థం చేసుకోవాలి కానీ, తప్పు మార్గం కాక, సంపాదన కొరకు ఏ పని చేసినా తప్పు లేదు గా...

కామెంట్‌లు