తాతయ్య కబుర్లు-20.- ఎన్నవెళ్లి రాజమౌళి


 పిల్లలూ! వేమన శతకం తెలవని వాడు ఉండడు అన్నది అతిశయోక్తి కాదేమో! వేమన, సుమతి పద్యాలు పండితులకే కాక, పామరుల నాలుకలపై కూడా నాట్యం చేస్తుంటాయి. పద్యంలో చందస్సు ఉండడం వలన, ప్రాస నియమం, యతి నియమాలు ఉండడం వలన పద్యాలు చదవడానికి ఇంపుగా ఉంటాయి. బావ యుక్తంగా కూడా ఉంటాయి. పిల్లలకైతే పాఠ్యాంశాలలో వేమన, బద్దెన పద్యాలే కాక, జంధ్యాల పాపయ్య శాస్త్రి పద్యాలు కూడా కొట్టిన పిండే! పెద్దయిన తర్వాత ఏనుగు లక్ష్మణ కవి, భాస్కర శతకము, దాశరధీ శతకాలు మొదలగునవి తెలుసుకుంటారు. ప్రస్తుతం సరళంగా ఉండే పైన చెప్పిన కవుల పద్యాలు విధిగా నేర్చుకోవాలి. పద్యాలు చదివితే సభలోనైనా, సమావేశాలలో నైనా గౌరవంగా ఉంటుంది కదా!

కామెంట్‌లు