ఉగాది బాలల కవితల పోటీ 2021 ఫలితాలు విడుదల.


 విద్యార్థులలో దాగివున్న సృజనాత్మక అంశాలను వెలికి తీయడానికి అక్షర  సేద్యం ఫౌండేషన్ నిర్వహించిన ఉగాది బాలల కవితల పోటీకి ఉభయ తెలుగు రాష్ట్రాల విద్యార్థుల నుండి 215 కవితలు రాగా, ప్రముఖ కవి అన్నవరం దేవేందర్ న్యాయ నిర్ణేతగా వ్యవహరించి విజేతలను ఎంపిక చేసారని పోటీల కన్వీనర్ వేల్పుల రాజు  సిద్దిపేట లో  తెలిపారు. హైదరాబాద్ సంఘమిత్ర పాఠశాల విద్యార్థిని బి.శ్వేత ( ప్రకృతే గురువు ) కు ప్రథమ బహుమతి లభించింది. హన్మకొండ మాస్టర్ జీ పాఠశాల విద్యార్థిని బి.నిక్షిత (చిన్నారుల సంబురం ), విజయవాడ సిద్దార్థ పాఠశాల విద్యార్థిని పి.చిన్మయి(ప్లవనామ ఉగాది ) లు ద్వితీయ బహుమతులు సాధించారు.గుంటూరు మంగళగిరి అరవింద పాఠశాల విద్యార్థిని డి.ఉషశ్రీ (  చెట్టు),మెదక్ హావేలి ఘన పూర్ ఉన్నత పాఠశాల విద్యార్థిని జి.స్రవంతి( దేశానికి నువ్వే దిక్కు) ,షాయంపేట్ మహాత్మా జ్యోతిరావు పూలే పాఠశాల విద్యార్థి పి.యశ్వంత్  ( నా పల్లె నా ఊపిరి)లు తృతీయ బహుమతులు పొందినవారు.వీరు కాకుండా ఇంకా 10 మంది విద్యార్థులు  ప్రోత్సాహక బహుమతులు సాధించారు. ఈ ఫలితాల విడుదల కార్యక్రమంలో అక్షర సేద్యం ఫౌండేషన్ అధ్యక్షుడు భైతి దుర్గయ్య, బహుమతి ప్రదాత చెవిటి ఆనంద్ శ్రీనివాస్ పాల్గొన్నారు.

కామెంట్‌లు