తాతయ్య కబుర్లు-21. -ఎన్నవెళ్లి రాజమౌళి


 పిల్లలూ! సైకిల్ నడిపితే మీకు విమానం నడిపిన అంత సంబరంగా ఉంటుంది. నిజమే మేము కూడా చిన్నప్పుడు డు ఆ అనుభూతిని పొందాము. కానీ, జాగ్రత్త తప్పక పాటించాలి. ఎడమ దిక్కుగా వెళ్లాలి. ఎడమ దిక్కుగా వెళ్లడం వలన ప్రమాదాలు జరగకుండా ఉంటుంది. సైకిలే కాదు! నడిచిన ఎడమ దిక్కుగా నడవాలి. ముఖ్యంగా సైకిల్ నడిపినపుడు రోడ్ క్రాసు చేయాల్సి వస్తే... అటు ఇటు జాగ్రత్తగా చూడాలి. ప్రమాదాలు ఎక్కువ రోడ్డు క్రాస్ చేసినప్పుడే జరుగుతాయి. సైకిల్ ఎక్కి సైకిల్ మోటార్ లా పోవాలంటే పోదు కదా! అందుకే స్పీడ్ కూడా కంట్రోల్ చేసి మెల్లగా వెళ్లాలి. బ్రేకులు సరిగా ఉన్నది లేనిది చూసుకోవాలి. సైకిల్ ఏ కదా అని, ఎటు పడితే అటు నడపొద్దు సుమా! మెల్లగా వెళ్లాలి. నిదానమే ప్రధానం కదా!