వేదమంత్రాలతోడ
హరిణి వారేడిరాడ
సాగు చుండె ముందుకు
ఆనావ భక్తి తోడ
సోమకాసురుడను వాడు
అపహరించి పోయినాడు
దాగినాడు నీటి లోన
దేవుడేమొ చూసినాడు
శ్రీహరి జలమున తిరిగి
ఆటలు ఆడగ మునిగి
అట ఇట సంచరించి
కవచము నతడు తోడిగి
కాళరాత్రేమొ ముగిసెను
హాయగ్రీవుని చంపెను
నాలుగు వేదాలను తెచ్చి
బ్రహ్మ దేవునికి ఇచ్చెను
చేప రూపు వదిలినతడు
స్వర్గ మేము పోయినాడు
కొలువుతీరి లక్ష్మితో
ముల్లోకాలేలినాడు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి