ఊహల వుయ్యాల ...!!: -__డా.కె .ఎల్ .వి.ప్రసాద్ ,--హనంకొండ.4:-మొబైల్....9866252002.

 వారంలో ....
సొమవారం తో ..
మొదలవుతుంది ,
ఆ దివారం గురించిన 
ఆలోచన ....!
నిరీక్షణలో ....
ఆరు రోజులు 
తన్నుకుంటే తప్ప ...
అదివారం అనే ..
ఆశా దీపం వెలగదు !
వారంలో ....
ఆ ..రోజుకే ఎందుకో 
అంత ప్రత్యేకం ?
ప్రత్యేక కార్యక్రమాలన్నీ ..
ఆ ..రోజుకోసమే 
ఎదురు చూస్తుంటాయ్ ,
ఆ ..రోజు గురించే ...
అధికంగా ఆలోచిస్తుంటాయ్ !
దేవుడిచ్చిన సెలవని,
ఆదివారానికి పేరు,!
అందుకేనేమో ...
ఇంటిల్లిపాదీ ...
అదివారం హై లైట్స్ గురించి,
తర్జన భర్జనల్లో 
తల మునక లౌతుంటారు !
ఇంటావిడ ...
సినిమా అంటుంది,
అమ్మాయికి ,
పిక్ నిక్ ..సరదా,
అబ్బాయికేమో,
బయటి భోజనం రుచి ,
నా ఓటు పడితే తప్ప 
ఎవరి ఆలోచనా నెగ్గదు !
అదివారం బద్దకంతో ..
తీరిగ్గా తెల్లవారుతుంది,
తీరా చూస్తే ...
ఎవరి ఆలోచన ...
కలిసొచ్చి గట్టెక్కదు ,
ఇంటి పెద్ద మాత్రం ...
సంచీ చేతబట్టుకుని ..
మార్కెట్టుకు ..
దారి తీయక తప్పదు ,
వంటా ..వార్పూ 
మందకొడిగా ..
మధ్యాహానం వరకూ 
కొనసాగుతుంది,
తిండి ..తిప్పలు పూర్తయ్యాక ,
నిద్రాదేవి ..ప్రేమగా పిలుస్తుంది,
ఇంకే ముంది ....
అదివారం ఆఖరి సీను పూర్తయ్యి ,
రాత్రికి ..శుభం కార్డు పడుతుంది ,
మనసు మళ్ళీ ..
వచ్చే అదివారం కోసం ,
ఆలోచనలో పడిపోతుంది !!