ఉగాది పండుగ వచ్చింది
ఉషస్సు లెన్నో తెచ్చింది
కొత్త బట్టలు వేసుకొని
చెంగు చెంగునా ఆడెదము మామిడి ఆకులు కట్టెదము
ఇల్లంతా సందడి చేసెదము
కొత్త కుండను తెచ్చెదము
సున్నం బొట్లు పెట్టెదము
వేప, తీపి ,పులుపు, కారం
ఉప్పు ,వగరు షడ్రుచులు
కుండలో పచ్చడి చేసెదము
దొప్ప లో పచ్చడి పోసుకుని
ఆనందంగా సేవిద్దాం
పప్పు తో చేసిన భక్షాన్నమ్ములు
నెయ్యి పోసి ఆరగిస్తాం
కమ్మటి పప్పు కట్టు చారు
పచ్చడి ఆకుల్లో భోజనాలు
కడుపునిండా తిందాము
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి