*శ్రీ కృష్ణ శతకము* - పద్యం (౫౯ - 59)

 కందము :
*శతకోటి భానుతేజా*
*యతులిత సద్గుణగణాఢ్య | యంబుజనాభా*
*రతినాధజనక లక్ష్మీ*
*పతిహిత ననుగావు భక్త | సన్నుత కృష్ణా !* 
తా.: ఓ రుక్మిణీ నాధా, సత్యా వల్లభా, గోపికాలోలా..
రంగపురవిహారా,    వందమంది సూర్యలు ఒకేసారి ఉదయిస్తే వచ్చే కాంతిని కలిగి వున్న జగదోద్ధారకుడవైన వాడా,  లోకములోని సద్గుణములన్నీ నీవిగా వున్నవాడా,  నాభిలో పద్మము గలవాడా, మన్మధునికి తండ్రివి, లక్ష్మీ దేవి భర్తవు అయి భక్తులు అందరి చేత స్తుతి చేయ బడినవాడవు అయిన కృష్ణా !!!. దయతో నన్ను కాపాడు సర్వభూపాలా ...అని  శతకకారుడు నృసింహ కవి వాక్కు.
*అక్రూరవరదా!, ఆంజనేయ వరదా!!. సర్వభూపాలా "అంతయు నీవే హరి పుండరీకాక్ష, చెంతమాకు నీవే శ్రీ రఘురామా."*
.....ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss