*శ్రీ కృష్ణ శతకము* - పద్యం (౬౦ - 60)

 కందము :
*మందుఁడ, నే దురితాత్ముఁడ*
*నిందల కొడిగట్టినట్టి | నీచుని నన్నును*
*సందేహింపక కావుము*
*నందును వరపుత్ర నిన్ను | నమ్మితి కృష్ణా !* 
తా.: ఓ రుక్మిణీ నాధా, సత్యా వల్లభా, గోపికాలోలా..
రంగపురవిహారా, మంచి చెడులు తెలియని వాడిని.  పర నింద మాత్రమే చేసే ఆలోచనలో వున్నవాడిని.  చాలా నీచుడిని.  అందరూ నిందించే నీచపు పనులు చేసేవాడిని.  నువ్వేమో నందరాజుకి వరపుత్రుడుగా పుట్టిన వాడివి.  నేను నిన్ను మాత్రమే నమ్మి వున్నాను.  నువ్వే కాపాడాలి కృష్ణా!!!...అని  శతకకారుడు నృసింహ కవి వాక్కు.
*" నిన్ను నమ్మి కొలిచినవాడు, ఎంత మూర్ఖడైనా, చెడ్డవాడైనా, సమాజంలో ఎంత దిగజారిన స్థాయిలో వున్నా, తెలిసి గానీ, తెలియక అయినా, అనాలోచితంగా నైనా నీ పేరు ఒక్కసారి పలికితే మోక్షమే ఇవ్వగల వాడివి.  నన్ను, నా పరివారాన్ని నీవే కరుణజూపి కాపాడాలి, కన్నయ్యా!!!"*
.....ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss