*శ్రీ కృష్ణ శతకము* - పద్యం (౬౧ - 61)

 కందము :
*గజరాజ వరద కేశవ*
*త్రిజగత్కళ్యాణమూర్తి | దేవ మురారీ*
*భుజగేంద్ర శయన మాధవ*
*విజయాప్తుఁడ నన్నుగావు | వేగమె కృష్ణా !* 
తా.: ఓ రుక్మిణీ నాధా, సత్యా వల్లభా, గోపికాలోలా....
మొసలిని సంహరించి గజరాజును కాపాడిన వాడా, కేశి, ముర అనే రాక్షసులను సంహరించి ఉద్ధరించిన వాడా, మూడు లోకాలకు శుభమును కూర్చు వాడా, పాములలో పెద్దదైన శేషుని మీద నిద్రించే వాడా, లక్ష్మీ దేవికి భర్త అయిన వాడా,  అంతేకాదు అర్జునునకు ఎంతో ప్రాణ స్నేహితుడవు నీవు.  ఇందరిని ఉద్ధరించిన నీవు త్వరగా వచ్చి నన్ను రక్షించు శ్యామా.....అని  శతకకారుడు నృసింహ కవి వాక్కు.
*" ఈ లోకంలో ఎంతటి భుజబలము, యుక్తిపరుడు అయిన వానికి కూడా నీవేదిక్కు కదా కన్నయ్యా! మరి నేనో అర్భకుడను. ఏమీ చేయలేని వాడను. కేవలము నువు గర్తు చేస్తే తప్ప నీ నామ స్మరణము కూడా చేయలేని వాడను. దీనుడను. అసహాయుడను. త్వర త్వరగా వచ్చి నన్ను రక్షించి నీవే నీలో కలుపుకో  గోపికా వల్లభా!"*
.....ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss