*శ్రీ కృష్ణ శతకము* - పద్యం (౬౩ - 63)

 కందము :
*దుర్మతిని మిగుల దుష్టపు*
*కర్మంబులు జేసినట్టి | కష్టుఁడ నన్నున్*
*నిర్మలుని జేయవలె ని*
*ష్కర్ముఁడ నిను నమ్మినాను | నిజముగ కృష్ణా !* 
తా.: ఓ రుక్మిణీ నాధా, సత్యా వల్లభా, గోపికాలోలా....
ఒకప్పుడు,నేను చెడు బుద్ధి కలిగిన వాడిని.  ఎన్నెన్నో చెడుపనులు చేసి ఇతరులను కష్టాలకు గురి చేసిన వాడిని.  కానీ ఇప్పుడు, నేను చెడు ఆలోచనలు, చెడుపనులు, ఇతరులను బాధించడము మానేసి, మాట కూడా మాటడకుండా మౌని లాగా వున్నాను.  నీవే నిజము అనే నమ్మకం తో వున్నాను.  నన్ను మంచి వానిగా చేసి ఉద్ధరించు, ఉద్ధవ సన్నహితుడా...అని  శతకకారుడు నృసింహ కవి వాక్కు.
*" సర్వ కర్తవు. సర్వ భర్తవు. సర్వ రక్షకుడవు,నీవే కదా నందకుమారా! "జీవము నీవే కదా. నా ప్రాణము నీవే కదా!" ఇది ఒక్కటే నిజము, సత్యము అని తెలుసుకున్నాను, నీ దయవల్ల. ఇప్పుడు నీవే నాకు ధాతవు, భ్రాతవు, సఖుడవు, హితుడవు అన్నీ అని నమ్మి వున్నాను. "నమ్మినవారిని దయగనవా! శ్రీమన్నారాయణా...!! జగముల నేత, భాగ్యవిధాతా, శ్రీమన్నారాయణా!!" నన్ను ఉద్ధరించి, నీవాడిగా చేసుకుని,నీలోనే నిలుపుకో, నిఖిలాక్షా!!*
.....ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss