*శ్రీ కృష్ణ శతకము* - పద్యం (౬౬ - 66)

 కందము :
*బలమెవ్వడు కరి బ్రోవను*
*బలమెవ్వఁడు పాండుసుతుల | భార్యను గావన్*
*బలమెవ్వఁడు సుగ్రీవునకు* *బలమెవ్వఁడు నాకు నీవె | బలమౌ కృష్ణా !* 
తా.: ఓ రుక్మిణీ నాధా, సత్యా వల్లభా, గోపికాలోలా....
మొసలి బారి నుండి ఏనుగును రక్షించడానికి బలమెవ్వరు.  కౌరవసభలో పాండవుల ఇంటిమహలక్ష్మి గౌరవాన్ని కాపాడడంలో బలమెవ్వరు.  వాలితో యుద్ధంలో సుగ్రీవునికి  తోడుగా వున్న బలమెవ్వరు.  వీరందరికీ బలమైనవాడివి, తోడునీడగా వున్నవాడివి నీవేగా జగన్నాయకా.  ఇందరికీ, అందరికీ అండదండగా వున్న నీవే నాకు కూడా బలమై నాయందు వుండి నన్ను నడిపించు, నరహరీ..అని  శతకకారుడు నృసింహ కవి వాక్కు.
*ఎవరు ఎన్ని విధాలుగా ఇబ్బంది పడినా, కాలం కలసి రాకపోయినా, ప్రకృతి విపరీతంగా మన జాతకంతో ఆడుకున్నా, ఆ పరమేశ్వరని పేరు తెలిసిగాని, తెలియకగాని పలికితే తానే మన యందు బలమై, కలిమై వుంటాడు, నవనీతచోరుడు, నిక్కముగ.*
.....ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss