*శ్రీ కృష్ణ శతకము* - పద్యం (౬౭ - 67)

 కందము :
*పరుసము సోకిన యినుమును*  *వరుసగ బంగారమైన | వడుపున జిహ్వన్* 
*హరి నీ నామము సోకిన*
*సురవందిత నేను నటుల | సులభుఁడ కృష్ణా !* 
తా.: ఓ రుక్మిణీ నాధా, సత్యా వల్లభా, గోపికాలోలా....
దేవతలచే కొలవబడిన వాడా, అచ్యుతా! స్పర్శవేది తాకిన వెంటనే యినుము బంగారమౌతుంది కదా. అలాగే, నీ పేరు నా నాలుక అనేకసార్లు పలికినంతనే నేను కూడా సులభంగా మంచివాడుగా అవుతాను కదా, పరత్పరా......అని  శతకకారుడు నృసింహ కవి వాక్కు.
*"రామా" అని నేను పలక లేకపోయినా, "మరా, మరా" అని పలికినా కూడా, మోక్షాన్ని ఇచ్చావు కదా, బలిహరా.  ఇలా ఎంతో మందిని ఉద్ధరించిన నీ నామాన్ని నేను ఉచ్ఛరిస్తేనే నాకు కూడా ఇస్తావని నా నమ్మకము. ఈ విషయం నీవే రుజువు చేస్తావు అని నాకు కూడా అవగతమౌతోంది, అక్రూరవరదా.*
.....ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss
కామెంట్‌లు