తాతయ్య కబుర్లు-7.. :- ఎన్నవెళ్లి రాజమౌళి


 పిల్లలూ! గుండ్రంగా రాత కుదరడానికి డబల్ రూల్ కాపీ పెడతారు కదా! ఈ కాపీలను చూసి రాత కాపీలు అని కూడా పిలుస్తారు. రాత గుండ్రంగా ఉంటే... పరీక్ష పేపర్ లోని జవాబులు సార్లకు బాగా అర్థమవుతాయి. మార్కులు కూడా బాగా వస్తాయి. ఇంతెందుకు గుండ్రని రాత కు కూడా అదనంగా మార్కులుంటాయి. గుండ్రని గీతలలో సార్లు పై లైన్ లో రాసి ఇస్తారు. అది చూసుకుంటూ గీతల మధ్య అందంగా రాయాలి. నిన్న చెప్పుకున్నట్టు గాంధీ గారు చిన్నప్పుడు రాత విషయంలో అశ్రద్ధ చేసినట్టు, జీవిత చరిత్రలో రాసుకున్నారు. చిన్నప్పుడు నేర్చి తేనే రాత కుదురుతుంది. మీరు సాధన చేస్తారు కదూ!

కామెంట్‌లు