*శ్రీ కృష్ణ శతకము* - పద్యం (౭౨ - 72)

 కందము :
*తురగాధ్వరంబు జేసిన*
*పురుషులకును వేరెపదవి | పుట్టటయేమో*
*హరి మిము దలఁచినవారికి*
*నరుదా కైవల్య పదవి | యచ్యుత కృష్ణా !* 
తా.: ఓ రుక్మిణీ నాధా, సత్యా వల్లభా, గోపికాలోలా....
నాశము లేని వాడివి, శాశ్వతమైన వాడివి నువ్వే కృష్ణా! అశ్వమేధ యాగము చేసిన వారికి వున్నతమైన పదవి లభిస్తుంది అని లోకోక్తి.  కానీ, అశ్వమేధ యాగము చేస్తే వచ్చే పదవి వస్తుందో రాదో కానీ, పరమాత్మా నీ పేరు తలిస్తేనే కైవల్య పదవి, మోక్షము దొరకడము అనే విషయంలో ఎటువంటి సందేహము లేదు, అంబుజనాభా.....అని  శతకకారుడు నృసింహ కవి వాక్కు.
*నిన్ను నమ్మి, నీతోనే వున్న కుచేలుడు,  నీవే దిక్కని నమ్మిన కుబ్జ,  గోపగోపికా సందోహం, యాదవకులం మొత్తం, పాండవ రాజు కుమారులు ఎన్నెన్ని ఇష్టాలను అనుభవించినా, వాటినుండి గట్టెక్కిన వారే కదా, కుచేల సన్నిహితా.  నిన్ను పట్టుగొమ్మ చేసుకుని వున్నవారికి మోక్షమార్గం చాలా సుళువే, అంబరదేహా!!*
.....ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss
కామెంట్‌లు