కందము :
*శ్రీ పుండరీకలోచన*
*యో పురుషోత్తమ ముకుంద | యో గోవిందా*
*యో పురసంహారమిత్రుఁడ*
*యో పుణ్యుఁడ నన్ను బ్రోవు | మో హరి కృష్ణా !*
తా.: ఓ రుక్మిణీ నాధా, సత్యా వల్లభా, గోపికాలోలా....
తామర పూవుల వంటి కన్నులు కలవాడా, కృష్ణా! నువ్వు పరషులలో వుత్తముడివి, ఎక్కవగా కీర్తింప బడేవాడివి, పరమశివునకు స్నేహితుడైన నీవు స్వర్గమునకు అధిపతివి. పుణ్యమే నీవై కోరిన వారికి అందరికీ పుణ్యాన్ని ఇస్తూ వుంటావు. అటువంటి, నీవు నా యందు దయవుంచి నన్ను బ్రోవు మయ్యా, దేవకీ నందన.....అని శతకకారుడు నృసింహ కవి వాక్కు.
*ప్రపంచంలో వున్న కష్టాలు అన్నీ మాచే మోయించి, మళ్ళీ ఆ కష్టాలు తొలగింపజేసే వాడివి నువ్వే అని అర్ధమైనా, నాలుగు ఘడియలపాటు నీయందు మనసు నిలుపలేని దుర్బలులం. నిన్ను చేరుకోవాలి అని ఆర్తితో వున్నాము. మమ్ము కాపాడు, కైవల్యధామా.*
.....ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి