*శ్రీ కృష్ణ శతకము* - పద్యం (౭౭ - 77)

 కందము :
*ఏ విభుఁడు ఘోర రణమున*
*రావణు వధియించి లంక | రాజుగ నిలిపెన్*
*దీవించి యా విభీషుణు*
*నా విభు నే దలఁతు మదిని | నచ్యుత కృష్ణా !* 
తా.: ఓ రుక్మిణీ నాధా, సత్యా వల్లభా, గోపికాలోలా....
అత్యంత భీకరంగా జరిగిన యుద్ధంలో రావణుని చంపి, విభీషణుని లంకకు రాజుగా దీవించి  కూర్చోబెట్టిన  వాడు దశరధ కుమారుడు శ్రీరామచంద్రుడు.  అటువంటి పరమాత్ముని, నాకు కూడా దేవడు అయిన ఆ పరంధాముణ్ణి నేను చేతులు జాచి, నన్ను కాపాడమని, అంతమేలేని అచ్యుతుని ప్రతి క్షణము ప్రార్దిస్తున్నాను.....అని  శతకకారుడు నృసింహ కవి వాక్కు.
*నడిచే ధర్మం, మూర్తీభవించిన ఆదర్శమూర్తి, భ్రాతృప్రేమకు, భర్యాభర్తల అనురాగానికి ప్రత్యక్షసాక్షి, అయిన ఆజానుబాహుడైన శ్రీరామచంద్ర మూర్తిని ప్రతిక్షణమూ మనసులో తలచుకుంటూ, "నీవు తక్క ఇతఃపరంబెరుగ" అని మనస్ఫూర్తిగా నమ్ముతూ, మమ్ములను ఉద్ధరించగలవాడివి నీవే అని నమ్మి, నిన్నే వేడుకుంటున్నాను, సుగ్రీవమిత్రా*
.....ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss