(ఇష్టపదులు )-కోదండరాముడు :-ఎం. వి. ఉమాదేవి.7842368534
కొలిచేటి వారికీ కొంగు బంగారమై 
కొలువై యున్నాడే కోదండరాముడూ 

అందని చందమామ అద్దమున జూపగా 
నవ్వులు రువ్వాడే నవనీత హృదయుడూ 

యజ్ఞ రక్షణకొరకు యతి విశ్వామిత్రుని 
వెంటనే  చనినాడు వేడుకగా రాముడు 

తాటకిని దునుమాడి తాపసి మెప్పు పొంది
 జనినాడే మిథిలకూ జానకీ రాముడూ 

శివధనువెక్కు బెట్టి శీఘ్రము సీతను గని 
హారమునె గొనినాడె హార్దికము రాముడూ 

మిథిలలో మ్రోగినవి మితిలేని వాద్యములు
 కమనీయమది సీత కళ్యాణ రాముడూ !!

సాకేత పురిలోను సాదర స్వాగతములు 
పుష్పవర్షము లోన పుణ్యగుణ ధాముడూ!

ఒకమాట యొకపత్ని ఒక బాణ సూత్రమున 
అలరించు చున్నాడె అయోధ్యా రాముడూ!!