*శ్రీ కృష్ణ శతకము* - పద్యం (౭౯ - 79)

 కందము :
*గంగ మొదలైన నదులను,*
*మంగళముగ జేయునట్టి | మజ్జనములకున్*
*సంగతి గలిగిన ఫలములు*
*రంగుగ మిము దలఁచు సాటి | రావుర కృష్ణా !* 
తా.: ఓ రుక్మిణీ నాధా, సత్యా వల్లభా, గోపికాలోలా....
నీ నుండే పుట్టి,ఈ భూమి మీద పారుతున్న గంగ, యమున, కృష్ణ మొదలైన పుణ్య నదులలో స్నానమాడితే ప్రజలు అందరూ శుభములు పొందవచ్చు అని అంటారు. కానీ, ఆ నదులలో చేసిన స్నానముల వల్ల వచ్చే ఫలితాలకన్నా, కన్నయ్యా!, ఒకసారి నీ పేరు తలచి నందు వల్ల వచ్చే పుణ్యం చాలా ఎక్కవ కదా కృష్ణమూర్తీ.  .....అని  శతకకారుడు నృసింహ కవి వాక్కు.
*నీవే గంగవు, కృష్ణ, కావేరీ, యమున మొదలుగా గల నదుల రూపంలో వున్నావని,అందుచేత ఆ నదులలో స్నానం చేస్తే జనులు సకల పుణ్యాల ఫలమూ పొందుతారని, ఎంత చక్కగా మాయ చేస్తావు, మురళీ గానలోల.  నీ పేరు లో కన్నా, ఈ నదులలో ఎక్కువ మహత్యం లేదు కదా, కంసారి.  నీవు, నీవు మాత్రమే నిజము, నిత్యము, సత్యము అనే నిత్య సత్యాన్ని మేము మరచి పోకుండా ఉండటానికి నీవే సహాయం చేయాలి, కుచేల మిత్రమా.*
.....ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss
కామెంట్‌లు