*మా మంచి నాన్న*:-తోకల దివ్య-8వ,తరగతి ZPHS గుర్రాలగొంది జిల్లా సిద్దిపేట చరవాణి:9704865816

 నాన్న ఉదయం లేస్తాడు 
బాయికాడికి పోతాడు 
బర్ల పాలు పిండుతాడు 
ఇంటికి తీసుకువస్తాడు
అమ్మ చాయ పెడుతుంది 
మాకందరికి పోస్తుంది 
నాన్న కూడ తాగాడు 
పొలం వద్దకు వెళ్ళాడు 
పొలము పనులు చేశాడు 
బాగా అలసిపోయాడు 
అక్క నేను కలిశాము 
కాళ్ళు ఒత్తుతమన్నాము
 నాన్న వద్దని అన్నాడు 
అయినా ఊరుకోలేదు
కాళ్లు చేతులు ఒత్తాము
నాన్ళ సేదదీరాడు
లేచినంక మాకు
బోలెడు ముద్దులు పెట్టాడు 
అమ్మానాన్నలు మాకు 
దేవుళ్ళతో సమానము