జింక - బుజ్జి పాప-(బాల గేయం)--పల్లోలి శేఖర్ బాబు కొలిమిగుండ్ల 8008527678.
ఎండాకాలం వచ్చింది
మండే ఎండలు తెచ్చింది
చెరువులో నీరు ఎండింది
జింకకు దాహం వేసింది

చెరువు అంతా తిరిగింది
నీటికోసం వెదకింది
ఊరు దారి పట్టింది
ఊరు చెంతకు వచ్చింది

ఊర కుక్క చూసింది
జింక పై దాడి చేసింది
జింకకు గాయం అయ్యింది
బుజ్జి పాప చూసింది

జింకను ఇంటికి తెచ్చింది
గాయానికి మందు వేసింది
అన్నల్లారా ..అక్కల్లారా..
పిన్నల్లారా.. పెద్దల్లారా..

నీటి తోట్లను పెట్టండి
తొట్లలో నీళ్లు పోయండి
జీవుల దాహం తీర్చండి
మూగజీవులను కాపాడండి.