*శ్రీ కృష్ణ శతకము* - పద్యం (౮౨ - 82)

 కందము :
*నీ నామము భవహరణము*
*నీ నామము సర్వసౌఖ్య | నవహకరంబున్*
*నీ నామ మమృత పూర్ణము*
*నీ నామము నే దలంతు | నిత్యము  కృష్ణా !* 
తా.: ఓ రుక్మిణీ నాధా, సత్యా వల్లభా, గోపికాలోలా....
ఈ ప్రపంచంలో వున్న బాధలను, భవబందాలను తొలగించేది నీ పేరు.  అన్ని సుఖాలనూ, సంతోషాలను ఇచ్చేది నీ పేరు.  నీ పేరు, అమృతంకన్నా ఎక్కవగా కమ్మనైనది, నీ పేరు చావును కూడా దరిచేరనీయదు.   అంత మహంతమైన నీ పేరును తలచుకుంటూ వుంటాను, నన్ను రక్షించు బలభద్రానుజా!....అని శతకకారుడు నృసింహ కవి వాక్కు.
*నీ నామము, ఆహా! ఒక్కసారి తలచుకుంటే మానసానికి ఎంత హాయిని ఇస్తావు స్వామి.  మాఘ మాసంలో, కార్తీక మాసములో తెలిసి గానీ తెలియక గానీ  ఆర్తితో నీ పేరు పలికిని వారికి నీ సాయుజ్యమే ఇచ్చావు కదా, జగన్నాటక సూత్రధారీ!  అరణ్య వాసంలో వున్న పాంచాలీ దేవి, ఋషి పుంగవుడు వచ్చి కోపిస్తున్నాడు అని నీ పేరు తలుచుకోగానే వచ్చి, ఆ ఋషికి తగు మర్యాద చేసి పాండవుల గారవం కాపాడావు కదా కమలదళేక్షణా!  నేను, ఎంతో అల్పుడను, ఎన్నలేని తప్పులు చేసినాడను, నీ నామోచ్ఛారణ తప్ప వేరు తెలియని వాడను.  నన్ను కనికరించి కాపాడు, ధరణీధరా! .*
.....ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss
కామెంట్‌లు