కందము :
*పాలను, వెన్నయు మ్రుచ్చిల* *రోలను మీ తల్లి గట్ట | రోషముతోడన్*
*లోలావినోది వైతివి*
*బాలుఁడవా బ్రహ్మగన్న | ప్రభుఁడవు కృష్ణా !*
తా.: ఓ రుక్మిణీ నాధా, సత్యా వల్లభా, గోపికాలోలా....
కృష్ణా! నువ్వు పాలు, వెన్నలు అందరి ఇళ్ళనుంచి దొంగిలించావని గోపికలు అందరూ యశోదతో మొర పెట్టుకుంటే నిన్ను కట్టడి చేయడానికి ఒకతాడుతో రోటికి కట్టేసింది. ఆటల మీద నీకు వున్న ఆసక్తి ఎవరికి తెలియనది నటన సూత్రధారి! నువ్వు చిన్మపిల్ల వాడివా, బ్రహ్మను కన్న తండ్రివి కదా, మదన గోపాల!!....అని శతకకారుడు నృసింహ కవి వాక్కు.
*కృష్ణా, చిన్నవాడా! పాలు త్రాగి, పూతనను చంపినపుడు, అది రాక్షస మాయ అనుకున్నది తప్ప, నీ మహిమ అని తెలియదు కదా యశోదా మాతకు. నిన్ను రోట కట్టితే అల్లరి తిరుగుళ్ళు తగ్గుతాయి అనుకుంది , కానీ, అది నీ ఆటలలో భాగమని తెలియదు కదా, నందసతికి. "కన్నయ్యా! మన్ను తిన్నవా?" బలభద్రుడు చెప్పాడు. "ఏదీ నీ నోరు తెరు" అని అమాయకంగా యశోదాదేవి అడిగినప్పుడు, నీవు బాలుడివి కాదు, బ్రహ్మాడమును మోసేవాడివి అని తెలుసుకోలేక పోయింది. నటనసూత్ర ధారి!!!*
.....ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి