కందము :
*రఘునాయక నీ నామము*
*లఘుమతితో దలఁచగలనె | లక్ష్మీరమణా*
*యఘములు బాపుదువు దయతో*
*రఘురాముఁడవైన లోక | రక్షకా కృష్ణా !*
తా.: ఓ రుక్మిణీ నాధా, సత్యా వల్లభా, గోపికాలోలా....
లక్ష్మీ దేవి భర్తవైన శ్రీకృష్ణా! రఘువంశం లో పుట్టిన రామచంద్రా, మూర్తీభవించిన ధర్మ మూర్తివైన నీ పేరును ఎవ్వరూ కూడా తక్కువ చేసి మాట్లాడలేరు కదా. ఎందుకంటే, లోకములో వున్న పాపాలన్నీ పొగొట్టడానకి రామావతారమెత్తిన పరమేశ్వరుడవు నీవే కదా కృష్ణా....అని శతకకారుడు నృసింహ కవి వాక్కు.
*కృష్ణా, ఈ భూమి మీద ఎప్పటికప్పుడు పుట్టుకొస్తున్న పాపాలను తుదముట్టించడానికి అప్పటికప్పుడు దశావతారాలు ధరించావు కదా ధరణీధరా! ఇంత మహిమాన్వితుడవైన నీ నామమును చిన్న దృష్టి తో ఎవరైనా చూడగలరా. అలా తక్కువ దృష్టి తో ఎవరైనా చూడాలి అనుకున్న ప్రతీసారీ ఆ వ్యక్తికే నీ నామ మహిమ చూపావు కదా, విదుర ఆనంద కారకా. ఎంతని పొగడగలము నీ నామ మహిమ.*
.....ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి