. స్ఫూర్తి - శక్తి... కందాలు ....:-: రామానుజం. ప-- జేబులో : 8500630543.

 

6)
రామాయణ, భారతములు ,
రమ్య,సు పరిపాలనా విధానముతెల్పున్  ;
ప్రేమయు, భక్తియు,కృష్ణుని
సౌమ్యత భాగవతమందు  సారూప్యమగున్  !!
7)
వేదము, ఇతిహాసములున్ ....
బోధలు, బాధల సుమార్గ బంధాల్తెల్పున్;
బోధించెను    అర్జును నకు,
ప్రధముగ   శ్రీ కృష్ణు  ' గీత '  సారము నెల్లన్  !!
8)
నన్నయ ,  తిక్కన, ఎర్రన
మిన్నంటిరి  భారత  రచనా  కవిత్రయమై ;
తినవలె  గారెలు  ,  లేదా  ,
వినవలె  భారత మనుచును విజ్ఞులు తెల్పెన్  !!