61)
అష్టా దశ అధ్యాయి గ ,
కృష్ణుడు బోధించె అర్జును నకున్ , ' గీతన్ ' ;
కృష్ణుడు నారాయణుడే ;
కృష్ణుడు , నరుడన్న అర్జు నుండే యిందున్ !!
62)
నరు నారాయణ వాదమె ,
నర లోకమునందు ' గీత ' ఆధార మయెన్ ;
పరమార్ధమును గ్రహించన్ ,
నిర్ధారిం చేడువంద్ల శ్లోకా ల్తోడన్ !!
63)
గీతా జయంతి జరుగును ,
ప్రతి యేటా మార్గ శీర్ష మాసము నందున్ ;
ప్రతి శుధ్ధేకాదశి నన్ ,
ప్రీతిగ , మాయింట ,గ్రామ మందును వేడ్కన్ !!
64)
గీతా పఠనము చేయుచు ,
గీతా చార్యుని సుబోధ గానము చేయన్ ;
గీతలు మార్చును వ్యక్తుల ,
గీతా సారము ఇహపర సౌఖ్యము నిచ్చున్ !!
65)
దైవము శక్తిని , ధైర్యము,
సేవా తత్పరత లెల్ల సాధ్య పరచియున్ ;
భావా వేశము నింపును ,
భావిని, సుఖ సంత సాల,భాగ్యము నిచ్చున్ !!
స్ఫూర్తి -- శక్తి..... కందాలు:-- రామానుజం. ప.-- జేబులో : 8500630543.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి