స్ఫూర్తి -- శక్తి..... కందాలు:- రామానుజం. ప.-జేబులో : 8500630543.
 71)
క్రీడలు,   శరీర  శక్తియు  ,
క్రీడాకారుల  మనో జ్ఞ   బుద్ధికుశలతన్ 
కూడా  పెంచును ;  ధైర్యము,
నడవడికల్లోను మార్పు  ,తెచ్చును పేరున్  !!
72)
వ్యాయామము  గొప్పదియే   ,
వ్యాయామము చేయువారు ఆహారమునన్ ,
నియమాలును  పాఠించుచు  ,
నిత్యము సాధనలు చేస్తె,నేర్పును పొందున్ !
73)
తోటలొ  , గృహాన  , గోవుల
పంట పొలములందు చేయు పనులును,శక్తే !
మేటి  పురుషు లెల్ల  శ్రమతొ   ,
మింటి కెగసె , వారి ప్రజ్ఞ పాటవములతోన్ !!
74)
ఆటలు  ఆడుట   మంచిది  ,
ఇంటా, బయటా, ప్రదేశ...రెండు విధములన్,
తోటి చెలికాండ్రు తోడన్  ,
పోటీ తత్త్వం పెరుగుచు,ప్రోత్సాహమిడున్ !!
75)
చెమటలు  పట్టిన  మంచిదె  ,
చెమటతొ, శారీర మందు చెడు పోగొట్టున్ ;
శ్రమ యెక్కువ చేయకుమీ   !
తమ శక్తికి మించిన చేస్తె ,నీరస మొచ్చున్  !!