స్ఫూర్తి -- శక్తి..... కందాలు:- రామానుజం. ప.జేబులో : 8500630543.

 76)
దిక్కులు   తెలియక  పిల్లలు  ,
ఫక్కున  నగుబా టగుదురు, ప్రేరణ లేకన్  ;
దిక్కులు  నాలుగు  ;  మూలలు
దిక్కులకు నడుమను వుండు; దిశలెనిమిదియే!
77)
సూర్యుడు దయించు   దిక్కే 
తూర్పగు;ఎదురుగ పడమర;తీరై యుండున్ ;
నీ  రెండు  చేత్లు  చాచగ  ,
తారసపడు, దక్షిణోత్తరములు కుడి ఎడమై  !!
78)
తూరుపు   ఆగ్నేయ ములును  ,
సైరుతి దక్షిణకు ఆనుకొనుచును యుండున్ ;
తీరుగ  ,  పడమర వాయువ్
వ్యు త్రీ శాన్యా లు  అన్ని ; వరుసన వుండున్ !! 79)
స్థిర వస్తువులకు  చెప్పిన  ---
తూరుపు నీ కుడిగ వుండు; పడమర ఎడమన్;
శిర భాగము  ఉత్తర యై  ;
ధర ,కాలూనినది   దక్షిణములై  తెలియున్   !!
80)
సూర్యుని  , చంద్రుని  గమనము,
ఆరోగ్యము, పగలు రేయి ఆకృతి దాల్చున్ ;
పూర్వులు  గణనము  చేసిరి  ,
మార్పులు, చేర్పులు ,
                గ్రహముల  మనుగడె యంచున్  !!