స్ఫూర్తి -- శక్తి..... కందాలు:- రామానుజం. ప.--జేబులో : 8500630543.

 81)
అధ్యాపకుడన  , ఒజ్జయు,
విద్యను బోధించు మాష్ట్రు,టీచరు అనినన్ ;
దిద్దెడి   వారలు  ముగ్గురు  ,
బాధ్యతగల తల్లి, తండ్రి, బోధకులె యగున్ !!
82)
జ్ఞానమనెడు   సంపదతో  ,
తాను  వుదారముగ ఛాత్రు, తీర్చే దిద్దున్  ;
తన శిష్యుల  ఉన్నతికై  ,
తన  శక్తిని ధారపోసి, తన్మయ మొందున్  !!
83)
బోధకుడు   నిత్య  కృషితో  ,
విద్యార్ధిగనే ,   త నుండి , విద్యను నేర్పన్ ;
అర్ధించెడు   వానిష్టము
సాధన యైనచొ,వెలుంగు సత్ఫలితములన్ !!
84)
వేకువ  ఝామునె  లేచియు ,
చక్కగ దంతాలు శుభ్ర పర్చియు, దేవున్ ;
నిక్కముగను  ప్రార్ధించియు ,
ఎక్కము , పద్యముల వల్లె  వేయగ వలెనే !!
85)
సంధ్యా  సమయా లందున  ,
విద్యా బుధ్ధులను నేర్చి, స్థిరముగ చదువన్;
అధ్యాపకు లిచ్చిన పని  ,
అధ్యయనము చేసి, వ్రాస్తె , ఆదర్శమగున్  !!