86)గురువే దైవముగ తలచి ,గురు మార్గా లనుసరించి, గుణసాధనతోన్ ;గురు పూజను సేయగదే ,గురు పల్కులు వేదతుల్యముగదా ! తెలియన్ !!87)పరమోన్నతు లెంపికతో ,కారడవుల, పర్ణశాల, వాగుల చెంతన్ ;గురుకులము లలో విద్యలు ,పరమ పవిత్రము ;సుబోధిత ములై యుండెన్ !!88)ఛాత్రులు గురులకు సేవలు ,మిత్రులుగా కలసి చేయు మంత్రో చ్ఛరణన్ ;రాత్రియు , పగలును , వారలెఆతిధ్యము సేకరించి , అర్పించ వలెన్ !!89)పలు విద్యలు నేర్పించిన్ ,పలు శాస్త్రములన్, సుబోధ గావించుచునే ;పలు పర్యటనలు చేయుచు ,తెలిపెడి వారు తమ శక్తి ,సామర్థ్యములన్ !!90)అందరు తెలియగ వలెనే ,ఆదరణా భిమతములను,అంచన వేయన్ ;సాధన చేసియు , ఔషధవిద్యలు,అనుపానములనుప్రేమతొ నిచుటన్ !!
స్ఫూర్తి -- శక్తి..... కందాలు:-రామానుజం. ప.జేబులో : 8500630543.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి