స్ఫూర్తి -- శక్తి..... కందాలు:- రామానుజం. ప .--జేబులో : 8500630543 .
91)
కులవృత్తుల  వారందరు  ,
పలువృత్తులలో  చరించు , సంపాదనకై  ;
విలువగు    కళా నిపుణులును  ,
విలువైన పనితన మెంతొ మిగలక పోయెన్ !!

92)
యంత్రము  లొచ్చియు  వృత్తుల  ,
సొంతము కాకుండ పోయె సాధకు లిండ్లన్ ;
చింతలు  , కుటుంబ భారము,
పొంతన లేక  తమశక్తి , పాతర యాయెన్  !!

93)
పశువులు  బండ్లే   పోయెను  ,
కృశీవలురు కూడ యిక్కటుల పాలగుచున్ ,
ఆశలు   నీరై పోయెను ,
వశమాయె కరెంటు, సౌర, డీజిలు  వచ్చిన్  !!

94)
గ్లోబలు  నెట్వర్కులతో  ,
సింబలు,మార్కులు,డిజైన్లు,స్టేటసు వచ్చెన్;
మెంబర్ల   సంఖ్య  తరిగెను  ,
జంబ్లింగులతో మనుగడ చరితార్ధమయెన్  !!

95)
కార్మిక  ,  కర్షక , వృత్తుల
వారల ప్రోత్సాహ మిచ్చి  ప్రగతిని కోరన్  ;
త్వరితగతిని  సాధించగ  ,
భారత మాతకును  సేవ లందించుటయే !!