స్ఫూర్తి -- శక్తి..... కందాలు:--: రామానుజం. ప .జేబులో : 8500630543

 🕉శ్రీరామ నవమి  పర్వదిన సందర్భంగా🕉
          🌿అందరికీ  🌺శుభాకాంక్షలు🍀
96)
భద్రాచల మందును  ,  మా
శ్రీ రాంతీర్ధం న, ఒంటి మిట్టల యందున్ ;
శ్రీ  రాముని  జన్మదినం  ,
ఈ రోజున లోకమంత సేయును  స్తుతులన్  !!
97)
కడపలొ యున్నేక  శిలయె  ,
ఇప్డొంటి శిలేను , ఒంటి మిట్టగ  పిలువన్  ;
నేడు  ప్రభుత్వమె నచటను  ,
వేడుకలను చేస్తు,రాష్ట్ర ఖ్యాతిని నిలుపున్ !!
98)
రామ చరితమును  విన్నా  ,
రాముని నామం స్మరించ,రమ్యమె మనమున్ ;
రాముని,సీతను,  హనుమను,
రామానుజులన్   భజింత్రు  నృత్యాల్తోడన్  !!
99)
రామాయణ మితిహాసము  ,
రామాయణ మందు  ఆరు కాండలు గలిగిన్  ;
సామాన్య  ప్రజావళికిన్  ,
సుమధుర భావనలు నిచ్చి సాంత్వన కూర్చున్!
100)
పలు భాషలలో  నుండెన్   ,
పలు దేశములందు రామ ఆలయముండెన్ ;
వెలసెను  విజయనగరమున  ,
ఇల ' రాంనారాయణం' గ కీర్తియు,గణనన్  !!