స్ఫూర్తి -- శక్తి..... కందాలు:-రామానుజం. ప.-జేబులో : 8500630543 .
11)
వేదాలు, ఉపనిషత్తులు  ,
వేదాంగాలుతొ ,  సుభాష్య వచనాల్తోడన్  ,
విద్యయు  , ధ్యానము  , యోగా  ,
వైద్యము , జ్యోతిష , ఖగోళ... విజ్ఞుల ఖనియే !!

12)
హిందూ  , ముస్లిం  , క్రైస్తవ  ,
సింధీ  , జైనులు ను బౌద్ధ  ,  సిక్కులు... నెంతో  ;
సోదర  భావాలు గలిగి  ,
వుందు రిట ను , లౌకిక ప్రజలందరు  నొకటై   !!

13)
పాడియు  , పంటల  వృద్ధికి  ,
మేడిని  పట్టుచు ,పశువుల పెంచుచు కృషితో  ;
ఎండలు  , వానలు    గానక
నుండే  ,   శ్రమజీవులున్న  ధరణియు మనదే  !!