స్ఫూర్తి -- శక్తి..... కందాలు:-- రామానుజం. ప.జేబులో : 8500630543 .

 14)
కొండలు, కోనలు, వాగులు,
మెండుగ  నదులును,
                    సరసులు, ముచ్చట గొలుపున్   ;
పండును    ఫలములు  , కాయలు,
నిండుగ ,  చిరు ధాన్యరాశు లింటికి  చేరున్    !!
15)
తిధి,  వార,   నక్షత్రాలతొ ,
సాధువులకు   సేవ చేసి    సత్సాంగత్యం ...
పొందియు  ,  భక్తితొ  ,  శ్రద్ధతొ  ,
విందులు  ఏర్పాటు చేసి  ,  వేడుక  చేయున్   !!
16)
ఉపవాసము  లుందురుగా  !
ఉపచారాలతొ   గృహాన  పూజలు  చేసిన్   ,
అపరాహ్నము నన్  ,  అర్పిత  ,
సు  ప్రసాదము  స్వీకరించి  సంతృప్తిపడున్  !!