17)
గంగకు వొడ్డున వుండెను ,
గంగాధరుడు పరమేశ్వరాలయ మిచటన్ ,
నగరాజ తనయి కూడా
జగమును కాపాడ అన్నపూర్ణగ వెలసెన్ !!
18)
భారత జాతికి వెలుగై ,
నిరతము ప్రవహించు' గంగ 'నదియును గలదే ;
చేరును గంగలొ ' యమునా '
' సరస్వతి 'యు గూడ కాశికాపురి దరినిన్ !!
19)
తర్పణ లిత్తురు , పెద్దల
గుర్తుగ , భక్తితొ, త్రివేణి కలసిన చోటన్ ;
కర్మలు జరుగును మృత్యుల
తీరము నందున్న' ఘాట్ల',నిత్యము గూడన్ !!
20)
పావని గంగా మాతా !
నీ వుదకము నెన్నినాళ్ళు నైనను శుధ్ధం !
నిల్వను జేసియు పాత్రల ,
దేవుని పూజకు ; మృతునికి, శుద్ధికి వాడున్ !!
గంగకు వొడ్డున వుండెను ,
గంగాధరుడు పరమేశ్వరాలయ మిచటన్ ,
నగరాజ తనయి కూడా
జగమును కాపాడ అన్నపూర్ణగ వెలసెన్ !!
18)
భారత జాతికి వెలుగై ,
నిరతము ప్రవహించు' గంగ 'నదియును గలదే ;
చేరును గంగలొ ' యమునా '
' సరస్వతి 'యు గూడ కాశికాపురి దరినిన్ !!
19)
తర్పణ లిత్తురు , పెద్దల
గుర్తుగ , భక్తితొ, త్రివేణి కలసిన చోటన్ ;
కర్మలు జరుగును మృత్యుల
తీరము నందున్న' ఘాట్ల',నిత్యము గూడన్ !!
20)
పావని గంగా మాతా !
నీ వుదకము నెన్నినాళ్ళు నైనను శుధ్ధం !
నిల్వను జేసియు పాత్రల ,
దేవుని పూజకు ; మృతునికి, శుద్ధికి వాడున్ !!