స్ఫూర్తి -- శక్తి..... కందాలు : రామానుజం. ప. జేబులో : 8500630543 .

 21)
తిరుమల వాసుని  కొలువగ   ,
పరుగున  సప్తగిరు లెక్కు  ప్రార్థన  చేస్తున్  ;
కోర్కెలు   తీర్చే  శుభకరు ,
కరములు మోడ్చి,వరమీయ గోరెద స్వామిన్ !!

22)
శ్రీ దేవియు   భూ దేవియు   ,
హృద్యముగను  స్వామి
                      హృదయ  భాగము నుండున్  ;
పదములు  గూర్చెను  అనమయ  ,
పదుగురి   నోటను సుప్రీతి ప్రార్థన లాయెన్   !!

23)
గోవిందా  యని   కొండను  ,
పావంచాలన్ని    లెక్కపెట్టుచు    వెడలన్    ;
తెల్వదు --  కష్టము  , అలసట  ,
నీవే    నా దిక్కనుచును   నమ్మిక   తోడన్   !!

24)
తిరుమల    లడ్డూ  తెచ్చియు   ,
తరతమ   బేధములు  లేక  తప్పక  పంచున్   ;
తరిగొండన్న  ప్రసాదం  ,
కోరి భుజింత్రు,వితరణయు,మోదము నిండన్!!

25)
కలియుగ   వైకుంఠమునన్  ,
కలియుగ  అవతారమూర్తి  గా శ్రీ  స్వామిన్  ;
తల  నీలాలర్పించియు  ,
తలరాతలు  తెల్పుకొంద్రు తమకము  తోడన్ !!

కామెంట్‌లు